నల్లమలలో యురేనియంగా తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… యురేనియం ఉద్యమానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా… చెంచుల జీవితాల్లో మార్పు రాలేదని హనుమంతరావు అన్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారన్నారు.