ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఉదయం 9.30 గంటలకు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 08:57 AM

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో నేడు మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఉదయం 9.30 గంటలకు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2 చేరనుంది. గత నెల 22న ఇస్రోశాస్త్రవేత్తలు చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి పంపిన విషయం తెలిసిందే. 29 రోజుల తర్వాత శాటిలైట్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరుతోంది. సెప్టెంబర్‌-7న ల్యాండర్‌ చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ల్యాండైన 4 గంటలకు రోవర్‌ బయటకు రానుంది. చంద్రయాన్‌-2 అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయని ఇస్రో పేర్కొంది. ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను శాస్త్రవేత్తలు మండించనున్నారు. చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్యకు 150 కిలోమీటర్ల దూరానికి చేరనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com