న్యూఢిల్లి : నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని బిజెపి ఎంపి డి అరవింద్ కోరారు. నిజామాబాద్ ప్రజలు ఎంతోకాలంగా పేరు మార్పు కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. నిజామాబాద్ అనే పేరు శుభప్రదం కాదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇందూరు అనే శుభకరమైనదని, ప్రజల సెంటిమెంట్లు దానితో ముడివడి ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇందూర్ అనే పేరు హిందూ, ఇండియా పేర్లతో అనుసంధానమై ఉంటుందని ఆయన అన్నారు.