ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మయిలను వేధించే ఆకతాయిలకు గ్రామ బహిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 09:50 PM

అమ్మయిలను వేధిస్తే ఆ ఆకతాయిలను గ్రామ బహిష్కరణ చేయాలంటూ ఓ గ్రామ పంచాయతీ తీర్మాణం చేసింది. వివరాల్లోకెళితే... జిల్లాలోని హుజురాబాద్ మండలం చిన్నపాపయ్య పల్లిలో మంగళవారం జరిగిన గ్రామసభలో ఊరి బాగు కోసం ఓ సర్పంచ్ వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే.. ఆడపిల్లలు, మహిళలు వేధింపులకి పాల్పడే పోకిరీలను గ్రామ బహిష్కరణ చేయాలి. గ్రామంలో బెల్ట్ షాప్ లు నిషేధించాలి, గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ఆదర్శంగా ఉన్న ఈ నిర్ణయాలతో ఈ గ్రామం నేడు వార్తల్లోకి ఎక్కింది.  


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com