శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. బాలిక సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారిని అపహరించిన రంజిత్‌సింగ్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.