కేసీఆర్ సర్కారు తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మను పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలందరికీ కానుకలు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందనున్నాయి. కానీ హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పంపిణీ కాస్త ఆగిపోయింది. ఇది అక్కడి మహిళకు చేదు వార్త. ఎందుకంటే రాష్ట్రమంతటా జరుగుతున్న బతుకమ్మల చీరల పంపిణీ ఎన్నికల కోడ్ అమలు వల్ల సూర్యాపేట జిల్లాలో నిలిపివేశారు.