నల్గొండ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక మైన ప్రేమ, అభిమానం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. సూర్యాపేట, నల్గొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని చెప్పారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, ఇండస్ట్రీయల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నాయన్నారు. నల్గొండలో పానగల్ రిజర్వాయర్ ను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ది చేస్తామన్నారు.