గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు మేడిపల్లి, మతు సంగెం, నెరల్, బూర్గుల్ తదితర గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సర్పంచ్ నారాయణ, నెరల్ సర్పంచ్ శివనోళ్ల సుజాత, మతు సంగెం సర్పంచ్ కమ్మరు భాస్కర్, నాగుళూర్ సర్పంచ్ సావిత్రి, బూర్గుల్ సర్పంచ్ శివాజీ లతోపాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.