ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Nukarapu Surya Prakasa Rao | బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ ఫాల్కే అవార్డు అందుకోవటం గురించి సూర్య అధినేత అభిప్రాయం

mukha mukhi |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 12:35 PM

Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు


ప్రశ్న: సినీ మూల పురుషుడు ఫాల్కే అవార్డు అందుకోవ‌టానికి బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ అన్ని విధాలా అర్హుడే. ఈ విష‌యంలో సందేహంలేదు. దీనిపై మీరేమంటారు.


-వ‌సుధాకుమారి.ఎం. వ‌రంగ‌ల్‌


జవాబు: నిజ‌మే వ‌సుధ గారూ... ఫాల్కే అవార్డుకు ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్‌కి ఇస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. రెండు తరాలుగా అందరిని ఇన్స్పయిర్ చేస్తూ, అందరిని ఎంటర్టైన్ చేస్తున్న అమితాబ్ బచ్చన్‌ని ఈ అవార్డుకి ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆయనికి ఈ అవార్డు ఇవ్వడంతో దేశం మొత్తం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఆనందంగా ఫీల్ అవుతారు అని, అమితాబ్‌కి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేసారు. ఇది ముమ్మాటికి స‌హేతుకం. స‌రైన‌దే. ప్ర‌స్తుత త‌రుణంలో భార‌తావ‌నిలో ఈ స్ధాయి ఉన్న న‌టుడు ఉన్నాడ‌ని భావించ‌లేం.


భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేసి, విశేష సేవలందించినవాళ్ళకు ఈ అవార్డుని అందజేస్తారు. ఈ అవార్డు కింద ఒక స్వర్ణ కమలం పతకంతో సత్కరించి పదిలక్షలరూపాయలు నగదు బహుమతి అందజేస్తారు. మొదటి సంవత్సరం దేవికారాణితో మొదలుపెట్టి ఇప్పటివరకు మొత్తం 66 మందికి ఈ అవార్డు అందించారు. తెలుగు నుండి బి.ఎన్.రెడ్డి, ఎల్.వి ప్రసాద్, బి.నాగిరెడ్డి, పైడి జైరాజ్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కళాతపస్వి విశ్వనాథ్ ,బాలచందర్ లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది.  సినిమా రంగానికి ఆయన అందించిన, అందిస్తున్న విశేషసేవలను కొనియాడుతు,.ఆయన నటించిన ఎవర్ గ్రీన్ పాత్రలకు సంబందించి అల‌నాటి ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు.కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానులనుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com