సూర్యపేట జిల్లాలోని చెరువులన్ని నీటితో కళకళలాడలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆయన ఆదేశించారు. సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్ యస్ పి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలు మంత్రి జగదీష్ రెడ్డి అభిస్టం మేరకు ఆపేది లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపద్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.