సూర్యాపేట జిల్లాలోని చెరువులన్నీ కళకళలాడాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన ఇక్కడి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిండిన చెరువులు, నింపాల్సిన చెరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్గొండ నీటిపారుదల పరిస్థితిపై త్వరలోనే సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిల్లా కలెక్టర్ అమేయ కుమార్, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.