ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహసీల్దార్‌ సిబ్బందిపై మరో పెట్రో దాడి.. !

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2019, 07:14 PM

తహసీల్దార్ విజయ రెడ్డి పై పెట్రోల్ దాడి మరువక ముందే మరో ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ తహసీల్దార్ పై ఓ రైతు పెట్రోల్ పోసి దాడికి పాల్పడ్డాడు. ఎంతో కాలంగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమి పట్టాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహించిన కనకయ్య కార్యాలయ సిబ్బందితోపాటు, అటెండర్‌పై కూడా పెట్రోలు చల్లాడు. ఈ ప్రమాదం లో ఎవ్వరికి గాయాలు అవ్వలేదు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే పట్టాలు జారీ చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లగా, పెట్రోలు చల్లిన రైతుపై పోలీసులకి ఫిర్యాదు చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చెయ్యాలని కలెక్టర్‌ ఆదేశించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com