ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2019, 08:31 PM

తెలంగాణ ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67 ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ ప్రశ్నించింది. అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com