యాదాద్రి జిల్లా మోత్కూరులో సత్యనారాయణ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన పొలంలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారంటూ సత్యనారాయణ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే వచ్చి తన సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.