తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL తెలంగాణవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 3025 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి.
1. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL మొత్తం 2500 జూనియర్ లైన్‌మెన్-JLM, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-JACO, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్-JPO పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
2. జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు డిసెంబర్ 15న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిసెంబర్ 22న పరీక్షలు జరగనున్నాయి.
3. ఈ పరీక్షలకు సిలబస్ వివరాలతో పాటు పరీక్ష విధానం గురించి నోటిఫికేషన్లలోనే వెల్లడించింది TSSPDCL. నోటిఫికేషన్‌లో ఉన్న వివరాల ప్రకారం సిలబస్, పరీక్షా విధానం ఈ విధంగా ఉంటుంది.
4. TSSPDCL JLM Syllabus: జూనియర్ లైన్‌మెన్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. 80 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతీ జవాబుకు ఒక మార్కు ఉంటుంది. 65 ప్రశ్నలు ఐటీఐ సబ్జెక్ట్ నుంచి, 15 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ఉంటాయి.
5. TSSPDCL JLM Syllabus: ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషీన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మెషీన్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ గురించి ప్రశ్నలుంటాయి.
6. TSSPDCL JLM Syllabus: ఇక జనరల్ నాలెడ్జ్‌లో అనెలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ ఎఫైర్స్, కన్స్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్, పర్యావరణ సంబంధిత అంశాలు, విపత్తు నిర్వహణ, చరిత్ర, జాగ్రఫీ, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, వారసత్వం, కళలు, సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
7. TSSPDCL JPO Syllabus: జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతీ జవాబుకు ఒక మార్కు ఉంటుంది.
8. TSSPDCL JPO Syllabus: సెక్షన్-ఏలో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్, లేబర్ లాస్, సమాచార హక్కు చట్టం 2005, ఫ్యాక్టరీల చట్టం 1948, మినిమమ్ వేజెస్ చట్టం 1948, పేమెంట్స్ ఆఫ్ వేజెస్ చట్టం 1936, ఈక్వల్ రెమ్యునరేషన్ చట్టం 1976, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ యాక్ట్ 1948, ఈపీఎఫ్ చట్టం 1952, గ్రాట్యుటీ చట్టం 1972, వర్స్‌మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్‌ప్యూట్ యాక్ట్ 1947, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, లేబర్ చట్టాలు, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్, సెంట్రల్ జీఎస్టీ చట్టం 2019, జీడీపీ, గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్‌కు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి.
9. TSSPDCL JPO Syllabus: సెక్షన్ బీలో కంప్యూటర్ అవేర్‌నెస్‌కు సంబంధించి 20 ప్రశ్నలు, సెక్షన్ సీలో ఇంగ్లీష్ భాష, జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 30 ప్రశ్నలుంటాయి.
10. TSSPDCL JACO Syllabus: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. 80 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతీ జవాబుకు ఒక మార్కు ఉంటుంది. సెక్షన్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి 40 మార్కులు ఉంటాయి.
11. TSSPDCL JACO Syllabus: సెక్షన్ బీలో కంప్యూటర్ అవేర్‌నెస్‌కు సంబంధించి 20 మార్కులు, సెక్షన్ సీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ, జనరల్ నాల్డెజ్‌కు సంబంధించి 20 మార్కులు ఉంటాయి. దీంతో పాటు 50 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది.