రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. టీఆర్ఎస్ కీలక నిర్ణయం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 06:17 PM
 

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను శిబిరాల్లో ఉంచాలని భావిస్తోంది. అభ్యర్థులను రెండ్రోజుల పాటు క్యాంపుల్లో ఉంచాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. తెలంగాణలో రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఈ క్రమంలో, గెలిచిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల వలలో పడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు నిశ్చయించినట్టు తెలుస్తోంది.