అమానుషం.. ఆరునెలల పసికందు మృతదేహం లభ్యం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 06:40 PM
 

తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఎదగాల్సిన పసికందును పొదల్లో పడేశారు. తల్లి అనే పదానికి కళంకం తెచ్చేలా ఓ మహి ళ చేసిన పాపం పసికందు పాలిటశాపంగా మారింది. ఈ అనూమష చర్య హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువు కట్ట వద్ద, ఆరు నెలల మగ శిశువు మృతదేహం లభించింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేసారు.