వికారాబాద్ జిల్లాలో 144 సెక్షన్

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:04 PM
 

వికారాబాద్ జిల్లాలో శనివారం మున్సిపల్ ప్రాంతాలలో ఎలక్షన్ కౌంటింగ్ ఉన్నందున, వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాలు అయిన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ లలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడి ఉండవద్దని జిల్లాలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు ఎట్టి పరిస్థితులలో తీయరాదని, బాణసంచా కాల్చుటకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అని, గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతి ఉంటుంది అని, ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడినట్లు అయితే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా ప్రజలు జిల్లా పోలీసు అధికారులకు సహకరించాలని కోరుతున్నాము అని SP నారాయణ గారు తెలియజేశారు.