రైతుబంధు పథకం కేవలం ఎన్నికల బంధుగా మాత్రమే: రేవంత్ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 06:51 PM
 

రైతుబంధు పథకం కేవలం ఎన్నికల బంధుగా తయారైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ. లిక్కర్ ధరలను పెంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పంటలకు ధరలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏటా 530 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని. వాస్తవానికి 180 టీఎంసీలకు మించి ఎత్తిపోయడం లేదని దుయ్యబట్టారు.