పోలీస్ వాహనమంటే అందరికీ హడల్. ఆ వాహనం సైరన్ చేసుకుంటూ వస్తుంటే అలర్ట్ అవుతుంటారు. దానికంటూ ఓ గౌరవం ఉంది. ఓ హోదా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక స్థానం దాని సొంతం. అలాంటి వాహనాన్ని దండెంగా మార్చేశారు కొందరు. పోలీస్ బండి అని కూడా చూడకుండా.. దానిపై బట్టలు, దుప్పట్లు ఆరేశారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రకరకాల పంచులు దానిపై పేలుతున్నాయి. ఫొటోలో ఉన్న నేమ్ బోర్డును బట్టి వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో ఇది జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే ఎప్పుడు జరిగింది.. ఎవరు చేశారన్న విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.