మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకొనే ఆలోచనలో ఉన్నారా లేదా భవిష్యత్తు అవసరాల కోసం నెలనెలా డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ కోసమే లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా-LIC సరికొత్త పాలసీని ప్రకటించింది. LIC SIIP పేరుతో యూనిట్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఇది. ఇందులో నెలకు కనీసం రూ.4,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎల్ఐసీ సిప్ పాలసీతో వచ్చే లాభాలు ఏంటో తెలుసుకోండి.
కనీస వయస్సు- 90 రోజులు
గరిష్ట వయస్సు- 65 ఏళ్లు
మెచ్యూరిటీకి కనీస వయస్సు- 18 ఏళ్లు
మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు- 85 ఏళ్లు
పాలసీ టర్మ్- 10 నుంచి 25 ఏళ్లు
ఎంత పొదుపు చేయాలి: నెలకు రూ.4,000 లేదా ఏడాదికి రూ.40,000.
ఫండ్ ఆప్షన్స్- బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్‌డ్, గ్రోత్ పేరుతో నాలుగు ఫండ్ ఆప్షన్స్
విత్‌డ్రా- 5వ ఏడాది నుంచి పాక్షికంగా
పాలసీ లాభాలు- లైఫ్ రిస్క్ కవర్ ఉంటుంది.
సమ్ అష్యూర్డ్: 55 ఏళ్ల లోపు ఉంటే వార్షిక ప్రీమియంకు 10 రెట్లు, 55 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారికి వార్షిక ప్రీమియంకు 7 రెట్లు.