వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లకు మంత్రి ఈటల క్లాస్ తీసుకున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మరచి మీరే ఆందొళన చెందడం సమంజసం కాదన్నారు. కరోనా సోకిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు. ఐసోలేషన్ వార్డు దగ్గర ఉండటం వల్ల ఏ ఒక్కరికీ వైరస్ సోకదన్నారు. మంత్రిని తానే వచ్చానని, డాక్టర్లుగా మీరు భయపడటంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.