సీఎం కేసీఆర్కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరు, డిండిపై లేదని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కొన్ని ప్రాంతాలకేనా? అని ఆయన ప్రశ్నించారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహుల్ని నెత్తినపెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలోకి తీసుకుంటే ఇలాగే ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎర్రబెల్లి పాత్ర ఏంటని ప్రశ్నించారు. ఎప్పుడూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమేనా? అని ప్రశ్నించారు.