తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధిపై గవర్నర్ తో అధికార పార్టీ అసత్యాలు చెప్పించిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సొంత పార్టీపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలతోనే టీఆర్ఎస్ గెలిచిందని, అధిష్ఠానం పీసీసీ ప్రెసిడెంట్ గా ఈసారి తమకు అవకాశం ఇవ్వకపోతే ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తామా? లేక కొత్త పార్టీ పెడతామా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.