నిలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. అనంతరం నిలోఫర్ లోని మిల్క్ బ్యాంక్ ను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ నిలోఫర్ ఆసుపత్రిలో మిల్క్ బ్యాంకును సందర్శించడం,మహిళా దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేప్పడుతున్నాయని గుర్తు చేశారు. రొమ్ముపాలు బ్యాంకు కోసం పాశ్చరైజేషన్,ఇతర సదుపాయాలు కోసం 30 లక్షలు ఖర్చు అవుతుందని ప్రధాన మంత్రి ప్రతి నెల 9న ప్రతి గైనకాలజీష్టులు 4గురికి ఉచితంగా వైద్యం చేయాలని పిలుపునిచ్చారని తెలిపారు. మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు.మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.