ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిక్‌ టాక్‌ ఆడియో లాంచ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:13 AM

సరోజినీ దేవి నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు గ్రహీత పోలిచర్ల హరనాథ్‌ పిహెచ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం  టిక్‌ టాక్‌. చైతన్య సంగీతం అందించిన టిక్‌ టాక్‌ చిత్రంలోని పాటలు విడుదల కార్యక్రమం ఆదివారం ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పోలిచర్ల హరనాథ్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హ్రర్రర్‌గా ఉండేలా టిక్‌ టాక్‌ మూవీని తెరకెక్కించాను. ఈ సినిమాలో అందరికీ నచ్చే అన్ని అంశాలు ఉంటాయి. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఇందులో మిగతా సినిమాల మాదిరిగా బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హర్రర్‌ ఏమాత్రం ఉండదు. నిర్మాతగా ఇన్ని కుటుంబాలకు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతప్తిగా ఉంటుంది. అంతేగాక ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకొన్నాను. ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాం. ఇందులో ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌ రేవంత్‌, గీతామాధురి పాడిన మాస్‌ పాట ప్రధాన హైలెట్‌. శివ-హరిణి పాడిన మరో రెండు పాటలూ అలరిస్తాయి. మే నెలలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.


ఇందులో కథకు ప్రాధాన్యమున్న చాలా మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చినందుకు దర్శకుడు నిర్మాత హరనాథ్‌ గారికి కృతజ్ఞతలు, ఈ సినిమా అందిరికీ మంచి పేరు తెస్తుందన్నారు నిషిగంధ, మౌనిక. ఇంకా ఈ కార్యక్రమంలో డిజిక్విస్ట్‌ బసిరెడ్డి, కె.నాగకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com