ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఖైరతాబాద్ లోని అర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. మారుతీరావు అంత్యక్రియలను మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తుతోనే నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గదిలో విషం తాగిన తర్వాత.. బాటిల్‌ను కిటికీ నుంచి బయటకు పారేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మారుతీరావు మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.