అలర్ట్.. ఇకపై బ్యాంకులకు మూడు గంటలే పనిదినాలు..

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 07:03 PM
 

ఇక నుంచి బ్యాంకులు మూడు గంటల పాటు మాత్రమే పనిచేయనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు 8 గంటల పాటు పనిచేయడమనేది కష్టంగా మారుతోంది. అదే తరుణంలో బ్యాంకులను పూర్తిగా మూసేద్దామన్న కుదిరేట్టు లేదు. అత్యవసర పనుల్లో డబ్బు అవసరం పడుతున్న నేపథ్యంలో బ్యాంకు సేవలందించడం తప్పనిసరిగా మారింది. దీంతో బ్యాంకులు రోజులో మూడు గంటల పాటు మాత్రమే పనిచేయనున్నాయి. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. కాగా బ్యాంకులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 8 నుంచి 11, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల్లో ఏదైనా మూడు గంటల పాటు పనిచేయనున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ప్రజల కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.


Telangana E-Paper