ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడావడ్డీరేట్ల తగ్గింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2020, 08:08 AM

 ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)..మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్న ఈ నూతన వడ్డీరేటుతో ఖాతాదారులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగనున్నదని బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన వాహన, రిటైల్‌, గృహ రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8 శాతానికి దిగిరానున్నది. అలాగే ఒక్క రోజు నుంచి ఆరు నెలల్లో లోపు రుణాలపై వడ్డీరేటు కూడా 7.40-7.85 శాతానికి తగ్గనున్నది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com