తెలంగాణ ఎంసెట్ తేదీలపై క్లారిటీ!

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 05:12 PM
 

తెలంగాణలో నేడు ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీల ప్రకటన వెలువడనుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వనుంది. అధికారులతో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూలై 6 లేదా 8 నుంచి ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ఉండడంతో పాటు రాష్ట్రంలో జూన్ 8 నుంచి జూలై 5వ వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Telangana E-Paper