తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించింది. ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే అమలు కానుంది. జూన్ 7 వరకు మాత్రం అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు కానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అంతరాష్ట్ర రవాణాకు సర్కార్ అనుమతించింది. అదే విధంగా అంతరాష్ట్ర రాకపోకలకు కూడా సర్కార్ అనుమతించింది. అదే విధంగా కేంద్రం విధించిన షరతులన్ని యదావిధిగా అమలవుతాయని సర్కార్ స్పష్టం చేసింది.
హోటళ్లు,రెస్టారెంట్లు,మాల్స్ కు గ్రీన్ సిగ్నల్
జూన్ 8నుంచి ప్రార్ధనా స్థలాలకు అనుమతి. అన్ని ఆలయాలకు అనుమతి.
జూలై నుంచి స్కళ్లు,కాలేజీలకు అనుమతించే అవకాశం పై పరిశీలన.
సినిమా హాళ్లు,మెట్రో రైళ్లు ,జిమ్, స్విమ్మింగ్ ఫూల్స్ లకు అనుమతి లేదు.
పార్కులు, థియేటర్లు,బార్లు,ఆడిటోరియంలకు అనుమతి లేదు.
రాజకీయ,సాంస్కృతిక,బహిరంగ సభల పై నిషేధం.
అంతర్జాతీయ విమాన సర్వీసుల పై నిషేధం.
రాష్ట్రాల మధ్య సరుకుల రాకపోకలకు అనుమతులు అవసరం లేదు.