ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో దారుణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 01, 2020, 08:51 AM

కామంతో కళ్లుమూసుకుపోయి జూనియర్ లేడీ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. సీనియర్‌ డాక్టర్‌గా వైద్య సేవలందించడంలో సూచనలు చేయాల్సిందిపోయి కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఒప్పుకోకపోవడంతో రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా కోవిడ్ ఆస్పత్రిలో కావడం గమనార్హం. కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యులను దేవుళ్లుగా కొలుస్తున్న ఇలాంటి విపత్కర సమయంలో కామంతో రెచ్చిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చాడు. ఈ దారుణ ఘటన


జూనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న మహిళా వైద్యురాలిపై సీనియర్ డాక్టర్ అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో జరిగింది. పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని రిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ అయిన డాక్టర్ ఆమెపై కన్నేశాడు. తరచూ వేధింపులకు గురిచేసేవాడు.


ఆమె నైట్ డ్యూటీకి రావడంతో కీచక డాక్టర్ కామంతో రెచ్చిపోయాడు. ఆమెను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై పడి పశువాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఆమె కేకలు పెట్టడంతో నోరుమూసి అత్యాచారం చేసేందుకు విఫల యత్నం చేశాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను రేప్ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com