అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన పాల సరఫరాకు కావాల్సిన అన్ని రకాల హంగులు, సామర్థ్యం ఉన్న విజయ డెయిరీ సమాఖ్యను ఒక నోడల్ ఏజన్సీగా గుర్తించడానికి కావలసిన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను మంత్రి తలసాని కోరారు. విజయ డెయిరీ బ్రాండ్ ప్రోత్సాహం కోసం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పిస్తూ పాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.