యూట్యూబ్ వీడియోలు చూసేవారికి పనికొచ్చే సూపర్ టెక్నిక్!

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 04:27 PM
 

మీరు తరచూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వీడియోలు చూసేటప్పుడు వీడియో ప్రారంభం కావడానికి ముందు వ్యాపార ప్రకటనలు కనిపిస్తుండటం అందరికి తెలిసిందే. ఇలా అడ్వర్టైజ్ మెంట్స్ కనిపించకుండా యూట్యూబ్ వీడియోస్ చూడాలంటే కచ్చితంగా Youtube Premium సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో కానీ, యూట్యూబ్ ఛానల్ గానే చూసేటప్పుడు ఎడ్వర్టైజ్మెంట్ కనిపించకుండా అడ్డుకోవచ్చు.
దానికిగాను మీరు చేయవలసిందల్లా ఒక నిర్దిష్టమైన ఛానల్ పేరు పక్కన . అనే సింబల్ అదనంగా చేర్చడమే. ఉదాహరణకు మీరు http://youtube.com/123 అనే ఛానల్ కి వెళ్లారు అనుకోండి. అడ్రస్ బార్లో దాని పక్కన . చేర్చి http://youtube.com/123. అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇక మీదట ఆ ఛానల్ లో కనిపించే వీడియోలు ఆ బ్రౌజర్ విండో లో ఉన్నంత వరకు ఎలాంటి వ్యాపార ప్రకటనలు కనిపించకుండా ప్లే అవుతాయి. ఇదేవిధంగా విడిగా కనిపించే వీడియో లింగు పక్కన కూడా .ని జత చేయొచ్చు.
ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఈ టెక్నిక్ పూర్తి స్థాయిలో డెస్క్టాప్ లేదా లాప్ టాప్ కంప్యూటర్లు వాడే యూజర్లకి పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో ఇది పని చేయాలంటే, యూట్యూబ్ మొబైల్ అప్లికేషన్ కి బదులుగా, మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ ఓపెన్ చేసి, అందులో అడ్రస్ బార్లో మీకు కావాల్సిన వీడియో లేదా ఛానల్ లింక్ పైన చెప్పిన టెక్నిక్తో టైప్ చేసి ఫలితాలు పొందవచ్చు. యూట్యూబ్ మొబైల్ అప్లికేషన్ లో మాత్రం ఇది సాధ్య పడదు. ప్రస్తుతానికి ఈ టెక్నిక్ పనిచేస్తోంది. సమీప భవిష్యత్తులో యూట్యూబ్ దీన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది.