సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 02, 2020, 09:04 AM
 

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నియోజకవర్గం పరిధిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన నిధులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అందించారు. శనివారం ఆయన నివాసం వద్ద మంత్రి రాం గోపాలపేట డివిజన్ చెందిన మహ్మద్ జిలానీకి రూ.60వేలు, జీ. శైలజకు రూ.50వేలు, ఎం. జ్యోతి రూ.49,500, సురేష్ రూ.23,500, శివకుమార్ లకు రూ.15 వేల చెక్కులను అందించారు. ఈ సందర్భం గా మంత్రి తలసాని మాట్లాడుతూ... పేద ప్రజల అనారోగ్య సమస్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, గణేష్, సత్య నారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు.