ఆర్థిక సంక్షోభంతో పాటు క్రీడారంగం కూడా తీవ్రంగా నష్టపోయింది

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 02, 2020, 09:11 AM
 

కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు క్రీడారంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో పలువురు క్రీడాకారులు సమావేశమయ్యారు. టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్​ రెడ్డి స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ శ్రీనివాస్ రాజు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయేష్ రంజన్, చాముండేశ్వరినాథ్ హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ ఆగస్టు 5 నుంచి స్టేడియాల్లో క్రీడలు ప్రాక్టీస్ చేయవచ్చని పేర్కొన్నారు. టోర్నమెంట్ల నిర్వహణకు మాత్రం అనుమతి లేదని వివరించారు.