సీఎం కేసీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసులు కేసీఆర్ కు ఊడిగం చేయొద్దంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. గోశామహల్ వద్ద పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మమ్మల్ని చంపండి కేసీఆర్ నే ఏలుకోమనండి అంటూ జగ్గారెడ్డి బూతులు తిట్టారు. మాకు పవర్ వచ్చిన రోజు మీ పరిస్థితి ఎంటో ఆలోచించండి అంటూ పోలీసులకు జగ్గారెడ్డి హెచ్చరించారు. డీజీపీ సంగతి తెలుసంటూ మండిపడ్డారు. మేము పవర్ లో ఉన్నప్పుడు మాకు కూడా సెల్యూట్ కొట్టిన విషయం మారువొద్దని జగ్గారెడ్డి గుర్తు చేశారు.