ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల కోసం ఈ టర్మ్ పాలసీ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 08, 2020, 08:00 PM

కుటుంబ బాధ్యతగా ఎక్కువగా మహిళలపైనే ఉంటుంది. భార్యగా, తల్లిగా, కోడలిగా మహిళలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటారు. ఎలాంటి సమయంలోనైనా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. అలాంటి మహిళలకు మంచి పాలసీలు తీసుకోవడం ద్వారా కుటుంబానికి మరింత రక్షణ కల్పించే అవకాశం ఉంది. మహిళల కోసం ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి.దేశీ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మహిళలకు అందించే మంచి పాలసీ ఎల్‌ఐసీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీతో పాలసీ హోల్డర్ కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎల్‌ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ రూపంలో ఈ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్ల వద్ద ఈ ప్లాన్ దొరకదు. ఆన్‌లైన్‌లోనే దీనికోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకూ ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస పాలసీ వ్యవధి పదేళ్లు, గరిష్ట పాలసీ వ్యవధి 35 ఏళ్లు. కనీసం రూ.50 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పాలసీదారుడికి కచ్చితంగా రెగ్యులర్‌ ఆదాయం వచ్చే మార్గం ఉండాలి.ఏడాదికి ఒకసారైనా అంటే వార్షిక ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి కూడా చెల్లించొచ్చు.నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో ప్రీమియం చెల్లించే వీలు ఉంది. ప్రీమియంను ఉన్న గడువులోపు 30 రోజుల్లో కట్టకపోతే పాలసీ లాప్స్ అయిపోతుంది. ఈ పాలసీతో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం మాత్రం పొగతాగే వారికి ఒక విధంగా, తాగని వారికి ఒక విధంగా ఉంటుంది. స్మోకింగ్ చేసే వారి కన్నా చేయని వారికి ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం పడుతుంది. అలాగే మగవాళ్ల కంటే మహిళలకు తక్కువ ప్రీమియం ఉంటుంది.ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని పాలసీ తీసుకుంటే మంచిది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇంటి అడ్రస్‌కు వస్తాయి. ఒకవేళ పాలసీ హెల్డర్ చనిపోతే నామినీకి బీమా డబ్బు అందుతుంది.పాలసీదారుడు పాలసీ కాలంలో మరణిస్తే బీమా మొత్తాన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్స్ ఐదేళ్లు, పదేళ్లు, 15 ఏళ్లుగా ఉంటాయి. ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆప్షన్ వద్దనుకుంటే బీమా మొత్తం ఒకేసారి పొందే అవకాశం కూడా ఉంది. ఈ డబ్బును నామినీకి అందజేస్తారు. ప్రీమియంను క్రమం తప్పకుండా చెల్లిస్తే బీమా మొత్తంపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పాలసీ కాలం ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనాలు అందవు.కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఇవ్వడానికి ఇలాంటి పాలసీలు ఎంతో ఉపయోగపడతాయి. మహిళలకు తక్కువ ప్రీమియం పడే ఇలాంటి పాలసీలు తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది.ఇలాంటి పాలసీలు మహిళలకు చాలా అవసరం. చాలామంది మహిళలకు అసలు ఎల్‌ఐసీ పాలసీల గురించే తెలియదు. ఈ పాలసీ వివరాలను అందరికీ షేర్ చేయండి. దీనిమీద అవగాహన పెరిగితే మన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com