తెలంగాణలో ఎల్ఆర్ఎస్..దరఖాస్తు చేసుకోండిలా

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 08:40 PM
 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నఅక్రమ లే అవుట్లు, ప్లాట్లు, స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి ఆఖరి అవకాశం కల్పించింది. ఇందుకోసం ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూద్దాం.ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పూర్తి చేయడం చాలా సులభం. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ సదుపాయం ఉంటే పది నిమిషాల్లోనే పని పూర్తి చేసుకోవచ్చు. ముందు ఇంటర్నెట్ సదుపాయం ఉండే స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ తీసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఎల్ఆర్ఎస్.తెలంగాణ.జీవోవీ.ఇన్ (lrs.telangana.gov.in)అని టైప్ చేస్తే నేరుగా వెబ్సైట్లోకి వెళ్లొచ్చు. స్కీన్ మీద లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని కనిపిస్తుంది. అక్కడ అడిగే వివరాలను ఒకదాని తరువాత ఒకటి పొందుపరచాలి. ఫోన్ నంబరు ఎంటర్ చేయాలి. మనం ఇచ్చిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ తరువాత వ్యక్తిగత స్థలాలను రిజిష్టర్ చేసుకోవాలంటే ఇండివిడ్యువల్ లే అవుట్ను, డెవలపర్లు అయితే మొత్తం లే అవుట్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ స్థలాలకు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి.4. మీ ప్లాట్ హెచ్ఎండీఏ పరిధిలో ఉందా, మున్సిపాలిటీ, మన్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉందా అనే వివరాలు పొందుపరచాలి. ప్లాట్ ఉన్న జిల్లా పేరు అడుగుతుంది.వాటిని ఎంపిక చేసుకున్న తరువాత ఏ లోకాలిటీలో స్థలం ఉందో ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఇన్ బిల్ట్గానే మనకు కనిపిస్తాయి. మనం నేరుగా వాటిని ఎంపిక చేసుకుని తరువాత స్టెప్కు వెళ్లాలి. ప్లాట్, లే అవుట్ పరిధి ఏ లోకాలిటీ కిందకు వస్తుందో తెలిపిన తరువాత మీ ప్లాట్ నంబరును, సర్వే నంబరును ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్లో ఉన్న సర్వే నంబర్లు, ఏరియా ఎంత, ఎన్ని స్కోయర్ యార్డులు ఉందో ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ నంబరు, దాన్ని మనం ఏ సంవత్సరంలో రిజిస్ర్టేషన్ చేసుకున్నాం, ఏ ఏరియా సబ్ రిజిస్ర్టేషన్ ఆఫీసులో చేశామనే వివరాలను ఇవ్వాలి. మన డాక్యుమెంటు మొదటి పేజీని, లే అవుట్ కాపీని ముందే స్క్యాన్ చేసి పెట్టుకోవాలి. అవి 1ఎంబీ సైజులోనే ఉండాలి. లే అవుట్ దగ్గర మన డాక్యుమెంట్లో ఉన్న ప్లాన్ను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత ఆధార్ నంబరు ఇవ్వాలి.వ్యక్తిగత వివరాలు.. పేరు, తండ్రి పేరు, లింగం, డోర్ నంబరు, వీధి నంబరు, లోకాలిటీ, పిన్కోడ్.. వంటివన్నీ ఎంటర్ చేయాలి. ఈ మెయిల్ ఐడీ ఉంటే ఇవ్వాలి. ముందు ఇచ్చిన ఫోన్ నంబరుతో పాటు రెండో నంబరును కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఇండివిడ్యువల్ ప్లాట్ అయితే వెయ్యి రూపాయలు చెల్లించాలి. డెవలపర్ లేఅవుట్ అయితే పదివేల రూపాయలు చెల్లించాలి. మీ స్థలం ఎన్ని గజాలు ఉంటే దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాలి. కార్డు లేదా మొబైల్ వ్యాలట్ల నుంచి కూడా డబ్బు చెల్లించొచ్చు. డబ్బు చెల్లించిన తరువాత ఒక రిసిప్ట్ వస్తుంది. ప్లే స్టోర్ నుంచి ఎల్ ఆర్ ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, దాంట్లో కూడా సులభంగా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు.