గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్..ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల తగ్గింపు! గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్..ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల తగ్గింపు!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 09:00 PM
 

కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌పై విమర్శలు పెరిగిపోయాయి. అయితే, ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు ఊర‌ట కల్పించే న్యూస్ చెప్పింది సర్కార్. శాస‌న‌స‌భ్యుల విజ్ఞప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామని శాసనసభ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల ప‌ట్ల గౌర‌వం ఉన్నది కాబ‌ట్టే మొన్న తీసుకువ‌చ్చిన 131 జీవోను సవరిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ‌తంలో ఎప్పుడైతే వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో.. వాటి వాల్యూకు అనుగుణంగానే స‌వ‌రించిన జీవోను గురువారం విడుద‌ల చేస్తామ‌ని ప్రకటించారు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అనే తేడా లేకుండా ఎల్ఆర్ఎస్‌ స్కీమ్ వర్తింపజేసింది ప్రభుత్వం. ఇది, గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి అసలు ఓపెన్ ప్లాట్ కొన్నదానికంటే ఎల్ఆర్ఎస్‌కే ఎక్కువ సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే.. రిజిస్ట్రేషన్ స‌మ‌యంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకార‌మే రుసుం వ‌సూలు చేస్తామ‌ని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. దీంతో చాలా మందికి తెలంగాణ సర్కార్ ఊరట కల్పించింది.