బ‌హ‌దూర్‌పురాలో 110.3 మి.మీ. వ‌ర్ష‌పాతం

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 17, 2020, 08:45 AM
 

రాజ‌ధాని న‌గ‌రంలో నిన్న సాయంత్రం ఒక్క‌సారిగా కురిసిన భారీ వాన‌తో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు జీహెచ్ఎంసీలోని వి‌విధ ప్రాంతాల్లో న‌మోదైన వ‌ర్ష‌పాతం ఇలా ఉన్న‌ది. బ‌హ‌దూర్‌పుర‌లో అత్య‌ధికంగా 110.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోద‌వగా, రంగారెడ్డి జిల్లా గండిపేట‌లో 110.3 మి.మీ. వ‌ర్ష‌పాతం, రాజేంద్ర‌న‌గ‌ర్‌లో 105.3 మి.మీ., షేక్‌పేట‌లో 98.3 మి.మీ., షేక్‌పేట మండ‌లం టోలీచౌకీలో 97.8 మి.మీ., మేడ్చ‌ల్ జిల్లా ఉప్ప‌ల్‌లో 95.8 మి.మీ. చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. 


నిన్న సాయంత్రం న‌గ‌రంపై పూర్తిగా కమ్ముకున్న మబ్బులు కుంభ‌వృష్టి కురిపించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్ల‌న్నీ వ‌ర్ష‌పు నీటితో నిండిపోయాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల్లో చిక్కుకోవ‌డంతో ఇండ్ల‌న్నీ నీటితో నిండిపోయాయి. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద‌యం వ‌ర‌కు కురిసిన‌ వానతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.