ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిశువు ఎదుగుదలపై అవగాహన ఉందా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 07:01 PM

ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చేసే చిన్న పొరపాట్లు లేనిపోని సమస్యలకు దారితీస్తాయి. ఒక సందర్భంలో బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మాతృత్వానికి దగ్గరయ్యేవారు గర్భధారణ తర్వాత వివిధ దశలలో తప్పకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మెడికల్ఎక్స్ప్రెస్.కామ్ ప్రకారం గర్భవతుల్లో విటమిన్ డీ లోపం ఉంటే అది.. తల్లీ, బిడ్డలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శిశువు ఎముకల ఎదుగుదల, దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం అందేలా విటమిన్ డీ తోడ్పడుతుంది. అందుకే గర్భవతులు ఇలాంటి విటమిన్ లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దానికోసం కొన్ని పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమందిలో ప్రెగ్నెన్షియల్ డయాబెటీస్ కనిపిస్తుంది. ఇది శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో సుమారు 16 శాతం మంది మహిళలు ఈ వ్యాధికి గురవుతున్నట్టు అంచనా. దీన్ని ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో వివిధ రకాల కణాల సంఖ్యను సీబీసీ ద్వారా తెలుసుకోవచ్చు. తక్కువ ఎర్ర రక్త కణాల స్థాయిలు రక్తహీనతకు దారితీస్తాయి. తెల్ల రక్త కణాల సంఖ్య ద్వారా రోగనిరోధక శక్తిని అంచనా వేయొచ్చు. రక్తం గడ్డకట్టడంలో సమస్యలను ప్లేట్లెట్ల సంఖ్య వెల్లడిస్తుంది. గర్భధారణ సమయంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గితే విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ లోపం వంటివి ఉన్నాయని అర్థం. టెస్ట్‌ల ద్వారా ఇలాంటి సమస్యలున్నాయని తేలితే వెంటనే వాటికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి. తల్లి వయస్సు 37 సంవత్సరాలు దాటినప్పుడు, కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందే జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డకు కూడా జన్యుపరమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి రెండు రకాల జన్యు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అవి స్క్రీనింగ్, డయాగ్నస్టిక్ టెస్టులు. పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటే స్క్రీనింగ్ పరీక్షల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలు పిండం ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్ధారించలేవు. పిండానికి జన్యుపరమైన రుగ్మత ఉందో లేదో తెలుసుకోవాలంటే డయాగ్నస్టిక్ టెస్టులు చేయాలి. ఈ పరీక్షలు చాలావరకు మొదటి మూడు నెలల్లోనే చేయించుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ముందుగానే బిడ్డకు ఉండే వ్యాధిని గుర్తిస్తే దానిని ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. లోపల బిడ్డ ఎదుగుదల కోసం ప్రతి నెలా డాక్టర్ పర్యవేక్షణ అవసరం. వివిధ పరీక్షల ద్వారా లోపల పిండం ఎదుగుదలను తెలుసుకోవాల్సి ఉంటుంది. హృదయ స్పందన రేటు ఎలా ఉందో తెలుస్తుంది. పుట్టిన తర్వాత పిల్లలను సాధారణంగానే ఉంచాలా..? సి-సెక్షన్ అవసరమా అని నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది. ఫెటోస్కోప్ ద్వారా పరీక్ష చేస్తారు. ఇలా బిడ్డ పుట్టే వరకూ కొన్ని జాగ్రత్తలపాటు పౌష్టికాహరం కూడా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యవంతంగా పుడుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com