ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కష్ట కాలంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్సీ శంభిపూర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:53 AM

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటికి చెందిన 58 మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద రూ.58,06,728 విలువ చేసే చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భూపాల్, కమిషనర్ జ్యోతి మరియు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com