అందరిని ఆశ్చర్యపరుస్తూ.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడింది. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేసే యాప్‌ను తాము ఆమోదించబోమని.. అందుకే తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది. దీనితో ఇవాళ్టి నుంచి ప్లేస్టోర్‌లో ఈ యాప్ కనిపించట్లేదు. శుక్రవారం గూగుల్ తన బ్లాగ్‌లో ” అండర్స్టాండింగ్ అవర్ ప్లే గ్యాంబ్లింగ్ పాలసీలు ఇన్ ఇండియా’ అంటే టైటిల్‌తో ఉన్న ప్రచురణను చేయగా.. అందులో భారతదేశంలో జుదాన్ని ఆమోదించే, ప్రోత్సహించే యాప్స్‌కు సంబంధించిన సమస్యలను హైలైట్ చేసింది.
“వినియోగదారుల సురక్షితను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ప్లేను రూపొందించాం. అదే సమయంలో డెవలపర్లకు స్థిరమైన వ్యాపారాలను నిర్మించడానికి అవసరమైన వేదికను కూడా ఇస్తుంది. మా గ్లోబల్ పాలసీలు ఎల్లప్పుడూ ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడతాయి. మా వాటాదారులందరి మంచిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం” అని గూగుల్ తన బ్లాగులో తెలిపింది. అంతేకాదు పేటీఎం యాప్ ద్వారా లభించే ఆన్లైన్ కాసినోల సమస్యను హైలైట్ చేసింది. కాగా, ప్లేస్టోర్‌లో పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్‌లు మాత్రం ఉన్నాయి.