భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య ...

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 18, 2020, 05:49 PM
 

భాగ్యనగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. చందానగర్‌లోని ఓ భవనంపై నుంచి దూకి శ్రీవిద్య (27) ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. భర్త శబరీష్‌ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య నిన్న భర్త శబరీష్‌తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఈ సంఘటనపై చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 6 నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరీష్‌తో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్య వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.