తారానగర్ శ్రీ తుల్జాభవాని దేవాలయం హుండి ఆదాయం గతంతో పోలీస్తే ఘననీయంగా పెరిగింది. ఈ ఏడాది మార్చి 16 తర్వాత తాజాగా గత గురువారం నాడు దేవాలయంలో హుండీని లెక్కించారు. కాగా రూ.1,89,921 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి దృవీకరిస్తూ ప్రకటన జారీ చేశారు. ఐతే గతంలో సాదారణ పరిస్థితుల్లోనే ఈ మేర ఆదాయం వచ్చేది కాదు. కాగా కరోనా ఉదృతి కొనసాగుతున్న సమయంలో ఏడు నెలల్లో రూ.2 లక్షలు హుండీ ఆదాయం రావడం విశేషంగా బావించవచ్చు. అదేవిధంగా ఇటీవల జరిగిని శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లోను దాదాపూ రూ.2 లక్షలు(హుండీ మినహా) ఆదాయం రావడం విశేషం. వీటికి అధనంగా దాదాపు మూడు తులాల వరకు బంగారం రూపంలో అమ్మవారికి కానుకలు వచ్చినట్టు సమాచారం. హుండీ, ఉత్సవాల ఆదాయం పెరగడం, బంగారం కానుకలు రావడం పట్ల ఆలయ పాలకమండలి చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు పోరెడ్డి సంజీవరెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, గోవింద చారి, రవిందర్, సంపత్ గుప్త, రాజు తీవారీలు హర్షం వ్యక్తం చేస్తూన్నారు. తుల్జాభవానీ అమ్మవారి ఆశీస్సులతో ఆదాయం మరింత పెరగాతే, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తామని అంటున్నారు.
![]() |
![]() |