బీజేపీ పై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 04:32 PM
 

ప్రతిరోజు రాత్రి బీజేపీ, ఎంఐఎం నేతల ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని.. దీనికి సంధానకర్త అమిత్ షా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం… ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని విమర్శించారు.పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు.