వ్యవసాయ బావిలో పడ్డ చిరుత

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 13, 2021, 03:27 PM
 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చిరుత వ్యవసాయ బావిలో పడింది. జిల్లాలోని బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో బావిలో పడిన చిరుతను స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను బావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ప్రచారం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బావిలోకి దిగేందుకు మెట్లు లేకపోవడంతో వల వేసి తీయాలా లేదా మత్తు మందు ఇచ్చి చిరుతను బయటకు తీయాలా అనే విషయాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు.