మెదక్ జిల్లాలో భోగి పండుగ రోజు విషాదం..

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 13, 2021, 04:13 PM
 

మెదక్ జిల్లాలో భోగి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర చివరి యాత్రగా మిగిలిపోయింది. సరదాగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు మృత్యు ఒడికి చేరారు. వివరాల్లోకి వెళ్తే పుల్కల్ దగ్గర సింగూరు డ్యామ్ చూసేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్లారు. ప్రయాణంలో ఉండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు సోఫిక్‌, జమీర్‌, సమీర్‌ మృతిచెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.