ఊరెళ్తున్నారా? అయితే ఎవరితో చెప్పొద్దు!

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 13, 2021, 04:30 PM
 

సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళుతున్నారు. పట్టణాల నుండి పల్లెలకు జనాలు తరలి వెళుతున్నారు. అయితే.. సంక్రాంతికి ఊరు వెళ్ళేవారు స్థానిక పోలీస్ స్టేషన్ ‏లో సమాచారం ఇచ్చి వెళ్ళాలని, అలాగే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల స్టోరేజ్ డివైజ్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకొని వెళ్ళాలని హైదరాబాద్ సీపీ అంజినీ కుమార్ సూచించారు. ఊరు వెళ్ళే విషయాలను సోషల్ మీడియాలో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెప్పారు. తాజాగా హైదరాబాద్‏ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఊరికి వెళ్లే వారికి జాగ్రత్తలు చెప్పారు.